Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవన్నీ పుకార్లేనంటూ కొట్టిపారేసిన రాశి ఖన్నా

  • అనిల్ రావిపూడి నాకు హిట్ ఇచ్చాడు 
  • ఆయన .. రవితేజ నాకు మంచి స్నేహితులు 
  • అందుకే ఆయన మూవీలో స్పెషల్ సాంగ్ చేశాను
అందాల కథానాయిక అనిపించుకున్న రాశి ఖన్నా .. ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్ వైపు అడుగువేస్తోంది. ఆమె తాజా చిత్రంగా వచ్చిన 'తొలి ప్రేమ' హిట్ కావడంతో, ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని రోజుల క్రితం తనపై షికారు చేసిన పుకారును గురించి స్పందించింది.

'సుప్రీమ్' సినిమాతో తనకి అనిల్ రావిపూడి హిట్ ఇవ్వడం వలన, ఆయన తదుపరి సినిమా అయిన 'రాజా ది గ్రేట్' లో స్పెషల్ సాంగ్ ను ఫ్రీగా చేశాను. దాంతో అనిల్ రావిపూడితో ముడిపెడుతూ కొంతమంది ప్రచారం చేశారు. అనిల్ రావిపూడి నాకు మంచి స్నేహితుడు కావడం వలన .. నాకు మరో స్నేహితుడైన రవితేజ మూవీ కావడం వలన ఆ సినిమాలో ఆ సాంగ్  చేశాను .. అంతకి మించి మరేమీలేదు. ఇలాంటి పుకార్లు బాధ కలిగించడం లేదు గానీ .. లేని విషయాన్ని ప్రచారం చేసేవారి తీరే ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అంది. నితిన్ జోడీగా 'శ్రీనివాస కల్యాణం' మూవీ కోసం ఆమె ఎంపికైన సంగతి తెలిసిందే.  

rasi khanna
anil raavipudi

More Telugu News